![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -183 లో.. రాజ్ కి క్లయింట్ ఫోన్ చేసి.. మీ డిజైన్స్ లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. మీ డిజైనర్ కావ్య గారికి చెప్పి సరి చేయించండి అని రాజ్ క్లయింట్ చెప్తాడు. ఈ డిజైన్ మళ్ళీ రీడిజైన్ ఎలా చేయించాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ ఇద్దరు కావ్య గురించి మాట్లాడుకుంటారు. ఈ కావ్య ఏది అనుకుంటే అది చేస్తుంది. ఎలాగైనా కావ్యని ఇంట్లో నుండి పంపించెయ్యాలని రుద్రాణి అంటుంది.
అనామిక ఫోన్ నెంబర్ ఎలాగైనా కనుక్కోవాలని కల్యాణ్ అనుకొని.. అప్పు హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు. అప్పు చిరాకుగా మాట్లాడుతుంది. ఎట్టకేలకు అనామిక ఫోన్ నెంబర్ కనిపెడతాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ దగ్గరకి శృతి వస్తుంది. డిజైన్స్ లో కొన్ని రీడిజైన్ చేసి పంపించమన్నారు. ఆ డిజైన్స్ నువ్వు వేయమని శృతికి రాజ్ చెప్తాడు. అవి కావ్య మేడమ్ వేసినవి, మేడమే చెయ్యాలని శృతి చెప్తుంది. రాజ్ కోపంగా ఎవరు వద్దు నేనే వేసుకుంటానని చిరాకు పడుతాడు. మరొక వైపు కృష్ణమూర్తి విగ్రహలకి కలర్లు వేస్తూ కావ్య కి ఫోన్ చేసి రావద్దని చెప్పేలోపే కావ్య వస్తుంది. నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా? ఎందుకు వచ్చావని కృష్ణమూర్తి అడుగుతాడు. మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చానని కావ్య చెప్తుంది.
మరొక వైపు అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత నా నంబర్ కనిపెట్టినందుకు మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని అనామిక ఒక చోటుకి రమ్మని చెప్తుంది. దానికి కళ్యాణ్ ఒకే అంటాడు. మరొక వైపు అపర్ణ తో ఇందిరాదేవి మాట్లాడదు. నేనేం చేసానని మీరు నాతో మాట్లాడడం లేదు. మీ మాట వినలేదని నాతో మాట్లాడడం లేదా? అలా అయితే ఎన్ని సార్లు ఆ కావ్య నా మాట వినలేదు. అలాంటిది ఇప్పుడు నేను కూడా ఆ కావ్యకి శిక్ష వేస్తున్నాను. ఈ ఇంట్లో ఎవరు ఆ కావ్యతో మాట్లాడడానికి వీలు లేదని అపర్ణ చెప్తుంది. ఒక హిస్టారీకల్ నిర్ణయం తీసుకుంది. మా వదిన అని నువ్వు చెప్పినట్లు వింటాం. ఆ కావ్యతో మాట్లాడమని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |